
నీ మనసు నాకు తెలుసు ఈ దర్శకుడి డైరెక్షన్ లో తెరకెక్కిన తొలి సినిమా. తరుణ్, త్రిష, శ్రీయ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా పాటలు బాగా హిట్ అయినా, కథ కథనం ఆసక్తికరంగాలేకపోవడం వల్ల బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత ఈ దర్శకుడు 2006 సంవత్సరంలో విడుదలైన కేడీ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో జ్యోతికృష్ణ సోదరుడు రవికృష్ణ హీరోగా నటించారు. ఈ సినిమా కూడా ఆయనకు నిరాశనే మిగిల్చింది.
ఆ తర్వాత జ్యోతికృష్ణ ఊ లాలాలా పేరుతొ తమిళ సినిమాను తెరకెక్కించగా 2012లో విడుదలైన ఈ సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకుని ఆక్సిజన్ పేరుతో ఈ దర్శకుడు సినిమాను తెరకెక్కించారు. గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమా కూడా ఆశించిన విజయం సాధించలేదు. ఆ తర్వాత జ్యోతికృష్ణ డైరెక్షన్ లో రూల్స్ రంజన్ అనే సినిమా విడుదలైంది.
కిరణ్ అబ్బవరం హీరోగా 2023 సంవత్సరంలో రిలీజైన ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేదు. ఇలాంటి డైరెక్టర్ ను నమ్మి పవన్ ఛాన్స్ ఇచ్చి తప్పు చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ట్రాక్ రికార్డ్ చూసి జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. దర్శకుడు జ్యోతికృష్ణ డైరెక్షన్ కు దూరంగా ఉంటె మంచిదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.