
హరిహర వీరమల్లు సినిమాలో పవన్ ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోయిందని ఆయన వెల్లడించారు. హైపర్ ఆది ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఇందుకు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. సినిమాలో హై ఇచ్చే సీన్లు ఎక్కువగా ఉన్నాయని క్లైమాక్స్ సీన్ లో పవన్ కొరియోగ్రఫీ చేసిన ఫైట్, దానికి కీరవాణి ఇచ్చిన గూస్బంప్స్ తెప్పిస్తాయని ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో కలిసి వీరమల్లు చేసిన పోరాటాన్ని చూడాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.
ఫ్యాన్స్ కోరుకునే అంశాలతో మంచి మూవీ ఇవ్వాలని ప్రతి సీన్ పై ఎంతో ఇష్టంగా కేర్ తీసుకుని చేశారని ఆయన కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ తపన స్క్రీన్ పై కనిపించిందని ఫ్యాన్స్ కోసం ఒక హిట్ కావాలని కోరుకుంటే గబ్బర్ సింగ్ వచ్చిందని ఆ తర్వాత మరోసారి పవన్ కు హిట్ కావాలని కోరుకున్నామని ఆయన తెలిపారు. నిర్మాత ఏఎం రత్నం వరుస ప్రమోషన్స్ తో సినిమాను బయటకు తీసుకెళ్లారని ఆయన పేర్కొన్నారు.
పవన్ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ఇదే కాగా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకునే విషయంలో ఫెయిలైంది. ఈ సినిమాకు 11 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయని ప్రీమియర్స్ ద్వారా ఈ కలెక్షన్లు వచ్చాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ ఈ సినిమాతో అంచనాలను అందుకోలేకపోయినా ఓజీ సినిమాతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.