టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించాడు. ప్రస్తుతం పవన్ రాజకీయాలతో అత్యంత బిజీగా ఉన్నాడు. అయినా కూడా ఆయన కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా హరిహర వీరమల్లు అనే సినిమాను పూర్తి చేశాడు. ఈ మూవీ నిన్న అనగా జూలై 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఈ మూవీ విడుదలకు ముందే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను అత్యంత భారీ ఎత్తున చాలా ప్రాంతాలలో ప్రదర్శించారు.

అందులో భాగంగా ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను నైజాం ఏరియాలో కూడా భారీ ఎత్తున ప్రదర్శించారు. ఈ మూవీ ప్రీమియర్ షో లకు అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీని నైజాం ఏరియాలో మైత్రి సంస్థ వారు విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీటును నిర్వహించింది. అందులో భాగంగా ఈ మూవీ నైజాం థియేటర్ హక్కులను దక్కించుకున్న మైత్రి రవి నిన్న మాట్లాడుతూ ... తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హరిహర వీరమల్లు సినిమాకు ప్రీమియర్ షో ల ద్వారానే 3.36 కోట్ల షేర్ వచ్చింది. ఇది ఒక అద్భుతమైన రికార్డు అని ఆయన వెల్లడించారు.

అలాగే గురువారం నైజాం ఏరియాలో ట్రేడ్ రికార్డ్ స్థాయిలో మొదటి రోజు షేర్ కలెక్షన్లను హరిహర వీరమల్లు సినిమాకు ఆశిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే కాస్త మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా కూడా ఈ మూవీ కి ప్రీమియర్ షో ల ద్వారా అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. అలాగే మొదటి రోజు కూడా ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. నీది అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... జ్యోతి కృష్ణ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీ ని ఏ ఎం రత్నం నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: