
హరిహర వీరమల్లు సినిమా ఫలితం పైనే సెకండ్ పార్ట్ చేయాల వద్ద అనే విషయం ఆధారపడిందంటూ గతంలో నిర్మాత రత్నం, పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా ప్రకటించారు. ఇప్పుడు తాజాగా మరొకసారి ఈ విషయం పైన మాట్లాడుతూ.. ఈ చిత్రంలో జయసుధ కుమారుడు ఒక కీలకమైన పాత్రలో నటించారని ఆ పాత్ర గురించి సంబంధించి సెకండ్ పార్ట్ లో చాలా డీటెయిల్ గా ఉంటుందంటూ తెలియజేశారు.
ఇప్పటికే రెండో భాగానికి సంబంధించి 30% వరకు షూటింగ్ పూర్తి అయ్యిందని మిగిలిన భాగం కూడా పూర్తి అయిన తర్వాత సినిమా విడుదల కావాలని పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ తెలియజేశారు. దీంతో అసలు ఈ సినిమా సెకండ్ పార్ట్ ఉంటుందా లేదా అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాటన్నిటికీ కూడా బ్రేక్ వేసినట్టుగా కనిపిస్తోంది. నిన్నటి రోజున నిర్మాత ఏ.ఎం .రత్నం హరిహర వీరమల్లు సినిమా హిట్ కానీ హరిహర వీరమల్లు 2 అప్పుడు చూద్దాం అన్నట్లుగా తెలియజేశారు. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్గా మారుతోంది. మరి ఈ రోజున అధికారికంగా కలెక్షన్స్ విషయాన్ని తెలియజేస్తారేమో చూడాలి. ఇలాంటి రికార్డులను బ్రేక్ చేసిందో చూడాలి.