పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతుంది అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ సందడి వాతావరణం నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే దాదాపు ప్రీమియర్ షో లను ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రీమియర్ షో లు అనగానే అనేక మంది ఆసక్తిని చూపించడం సహజంగా జరుగుతూ ఉంటుంది. తాజాగా పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" అనే సినిమాలో హీరో గా నటించాడు. నిధి అగర్వాల్మూవీ లో హీరోయిన్గా నటించగా ... క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభం అయింది.

ఆ తర్వాత క్రిష్ జాగర్లమూడి ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకోవడంతో  జ్యోతి కృష్ణ అనే దర్శకుడు ఈ మూవీ కి సంబంధించిన మిగిలిన భాగం షూటింగ్ను పూర్తి చేశాడు. బాబి డియోల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించగా. ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఏ ఎం రత్నం ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించాడు. ఈ మూవీ నిన్న అనగా జూలై 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను కూడా భారీ ఎత్తున ప్రదర్శించారు. అందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను ప్రదర్శించారు. తూర్పు గోదావరి జిల్లాలో ఈ మూవీ ప్రీమియర్ షో లకి జనాల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. దానితో ఈ మూవీ తూర్పుగోదావరి జిల్లాలో ప్రీమియర్ లతోనే అదిరిపోయే రేంజ్ రికార్డును సొంతం చేసుకుంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి తూర్పు గోదావరి జిల్లాలో ప్రీమియర్ షో ల ద్వారానే ఏకంగా 1.53 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది . ఇలా ఈ మూవీ తూర్పు గోదావరి జిల్లాలో ప్రీమియర్ షో లతోనే సాలిడ్ రికార్డును సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ కి తూర్పు గోదావరి జిల్లాలో మొదటి రోజు కూడా భారీ ఎత్తున కలెక్షన్లు నమోదు అయ్యే అవకాశాలు బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి టోటల్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ  ఏరియాలో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: