
నైజాం ఏరియా విషయానికి వస్తే మైత్రీ మూవీస్, విశ్వప్రసాద్ జోక్యం చేసుకుని సమస్యను సానుకూలంగా పరిష్కరించారని భోగట్టా. విశ్వప్రసాద్ బాధ్యతలన్నీ తనపై వేసుకుని సమస్యలను పరిష్కరించడం కొసమెరుపు. పవన్ కు విశ్వప్రసాద్ అండగా నిలబడిన నేపథ్యంలో భవిష్యత్తులో పవన్ మరో సినిమా ఓకే చేస్తే పీపుల్స్ మీడియా బ్యానర్ లో నటించే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.
నిర్మాత ఏఎం రత్నంపై భారం తగ్గించే దిశగా అడుగులు పడ్డాయని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ సైతం విశ్వప్రసాద్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. పవన్ సైతం ఇలాంటి వ్యక్తులకు విలువను ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హరిహర వీరమల్లు రిజల్ట్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో మాత్రం తీవ్రస్థాయిలో నిరాశ నింపిందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
హరిహర వీరమల్లు ఫుల్ రన్ కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండనున్నాయో చూడాల్సి ఉంది. హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదల కాగా ఇతర భాషల్లో ఈ సినిమాకు ఆశించిన కలెక్షన్లు అయితే రాలేదు. హరిహర వీరమల్లు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే మాత్రం ఈ సినిమా మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశాలు అయితే ఉంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు