టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా వార్ 2 అనే సినిమాలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ నటులలో ఒకరు అయినటువంటి హృతిక్ రోషన్ కూడా నటించాడు. కియరా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించిన వార్ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతూ ఉండటం ,  ఇందులో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులు అయినటువంటి తారక్ , హృతిక్ నటిస్తూ ఉండడంతో ఈ సినిమాపై ప్రస్తుతానికి ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ఈ మూవీ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్ లో రూపొందుతుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

అందుకు ప్రధాన కారణం ఈ సినిమాలలో కథ కంటే కూడా యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడం , అలాంటి సినిమాలు వరుస పెట్టి అనేకం వస్తూ ఉండడంతో ప్రేక్షకులకు కూడా అవి రొటీన్ ఫీలింగ్ ను కలిగిస్తున్నాయి. దానితో స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలను ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడడం లేదు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలను బట్టి చూస్తే ఈ మూవీ కూడా భారీ యాక్షన్స్ సన్నివేశాలు ఉండే విధంగా కనిపిస్తున్నాయి. దానితో ఈ సినిమాలో యాక్షన్స్ సన్నివేశాల కంటే కథ ప్రాధాన్యత ఎక్కువ ఉన్నట్లయితే ఈ మూవీ  మంచి విజయాన్ని అందుకుంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: