తెలుగు సినీ పరిశ్రమలో ఎవరి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి మంచి స్థాయికి చేరుకున్న ఈ తరం హీరోలలో నాని ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో ఎన్నో మూవీ లతో మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇకపోతే నాని ఎక్కువ శాతం స్టార్ డైరెక్టర్ల కోసం వేచి చూడడం , కొన్ని క్రేజీ కాంబోలో కోసం వేచి చూస్తూ కాలాన్ని వృధా చేయకుండా ఎప్పుడూ ఏదో ఒక సినిమా షూటింగ్లో ఉంటూ సంవత్సరానికి కనీసం ఒకటి లేదా రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు.

ఇక ఆఖరుగా నాని "హిట్ ది థర్డ్ కేస్" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్నాడు. కొంత కాలం క్రితం నాని  , శ్రీకాంత్ ఓదెల అనే దర్శకుడి దర్శకత్వంలో దసరా అనే మూవీ లో హీరో గా నటించిన అద్భుతమైన విజయాన్ని అనుకున్న అందరికీ తెలిసిందే. ఈయన దర్శకత్వంలోనే నాని ది ప్యారడైజ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన ఓ గ్లిమ్స్ వీడియోను చాలా రోజుల క్రితమే విడుదల చేశారు. కానీ ఈ వీడియో విడుదల అయిన తర్వాత చాలా కాలానికి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది.

మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమా షూటింగ్ చాలా స్లో గా జరుగుతున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ సినిమా వచ్చే సంవత్సరం మార్చి 26 వ తేదీన విడుదల అయ్యే అవకాశాలు చాలా తక్కువ శాతం ఉన్నట్లు తెలుస్తోంది. అదే గాని జరిగితే ప్రతి సంవత్సరం ఒకటి లేదా రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించే నాని ఈ సంవత్సరం మాత్రం అలా చేయడం కష్టం అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ది  ప్యారడైస్ మూవీ వచ్చే సంవత్సరం మార్చి 26 వ తేదీన విడుదల అవుతుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: