కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో లోకేష్ కనకరాజు ఒకరు. ఈయన ఇప్పటివరకు దర్శకత్వం వహించిన సినిమాలలో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే  ఆఖరుగా లోకేష్ కనకరాజు తళపతి విజయ్ హీరోగా రూపొందిన లియో అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కి దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో కాస్త విఫలం అయింది. తాజాగా లోకేష్ కనకరాజు, సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరో గా రూపొందిన కూలీ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ లో నాగార్జున విలన్ పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే లోకేష్మూవీ కి సంబంధించిన ప్రచారాలను కూడా మొదలు పెట్టాడు.

అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న లోకేష్ రజనీ కి సంబంధించిన ఓ సీక్రెట్ ను బయట పెట్టేశాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా లోకేష్ మాట్లాడుతూ  ... ప్రస్తుతం రజనీ కాంత్ గారు తన ఆత్మకథ రాసుకుంటున్నట్లు లోకేష్ చెప్పుకొచ్చాడు. అలాగే కూలీ సినిమా చేస్తున్న సమయంలో కూడా రజనీ కాంత్ గారికి ఏ కాస్త ఖాళీ సమయం దొరికినా కూడా  ఆయన ఆత్మకథ రాసుకునే పనిలో బిజీ అయిపోయే వాడు అని కూడా లోకేష్ చెప్పుకొచ్చాడు. అలాగే రజనీ కాంత్ గారు తన ఆత్మకథ రాసుకునే సందర్భంలో తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తనకు మాత్రమే షేర్ చేసినట్లు కూడా ఇంటర్వ్యూలో భాగంగా లోకేష్ చెప్పుకొచ్చాడు. ఇలా రజినీ తో ఒక్క సినిమానే చేసి ఆయన ఆత్మ కథ గురించి ఆయన జీవితంలో జరిగిన అనేక విషయాల గురించి లోకేష్ తెలుసుకోవడంతో ఆయన చాలా లక్కీ అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: