పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన చిత్రం హరిహర వీరమల్లు. పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ జ్యోతి కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించేలా చిత్ర బృందం ప్లాన్ చేసింది. కానీ మొదటి భాగానికి సుమారుగా ఐదేళ్లపాటు సమయం తీసుకోవడంతో ఇక రెండవ భాగం ఉంటుందా? ఉండదా? అనే విషయంపై సరైన క్లారిటీ రాలేదు. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్ ఎంత రాబట్టిందనే విషయంపై వైరల్ గా మారుతోంది.


హరిహర వీరమల్లు సినిమా రెండు రోజులలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.79.90 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ ని రాబడినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మొదటిరోజు ప్రీమియర్స్ షోలతో కలిపి రూ .70 కోట్ల వరకు కలెక్షన్తో రాబట్టగా రెండవ రోజు రూ .9.90 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా తెలుస్తోంది. సినిమా విడుదలైన మొదటి షో నుంచి అబోవ్ యావరేజ్ గా నిలిచిన ఈ సినిమా రూ .100 కోట్ల మార్కును కూడా ఈరోజు లేదా రేపు అందుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వినిపిస్తున్నాయి.


హరిహర వీరమల్లు సినిమాకి VFX సరిగ్గా లేదని చాలామంది థియేటర్ల ముందు చెబుతూ ట్రోల్ చేస్తూ ఉన్నారు.. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రానికి స్టార్ హీరో చిత్రానికి ఇలాంటి పూర్ విఎఫ్ఎక్స్ వాడడం వల్ల  అభిమానులకి నచ్చలేదని విధంగా వినిపిస్తున్నాయి. వీటికి తోడు హరిహర వీరమల్లు 2 వ భాగానికి సంబంధించి షూటింగ్ మొదలు పెడతారా లేదా అనే విషయంపై సందేహంగానే ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ మధ్య తాను ఎక్కువగా పొలిటికల్ వైపు గానే దృష్టి పెడుతున్నానని.. అందుకే ఇక మీదట సినిమాలు చేస్తాను లేదో తెలియదు అంటూ తెలిపారు. అయితే ఇప్పటివరకు షూటింగ్ చేసిన సినిమాలను మాత్రమే పూర్తి చేసే పనిలో పడినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: