సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తాజాగా కూలీ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఓ కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... శృతి హాసన్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుంది. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా దర్శకుడు అయినటువంటి లోకేష్ వరుస పెట్టి ఇంటర్వ్యూలలో పాల్గొంటూ వస్తున్నాడు.

తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన శృతి హాసన్ కూడా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఈమె ఈ సినిమాలో నాగార్జున పాత్ర గురించి అదిరిపోయే రేంజ్ ఇచ్చింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా శృతి హాసన్ మాట్లాడుతూ ... నాగార్జున గారు కూలీ సినిమాలో నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలోని ఆయన పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది అని చెప్పుకొచ్చింది. ఇన్ని రోజుల పాటు నాగార్జున "కూలీ" మూవీ లో ఎలాంటి పాత్రలో కనిపిస్తాడు అనే ఊహాగానాలు జనాల్లో విపరీతంగా ఉన్నాయి.

శృతి హాసన్ చెప్పిన విషయాలతో నాగార్జున ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు క్లియర్గా అర్థం అవుతుంది. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన మాస్టర్ , విక్రమ్ సినిమాలలో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించాడు. ఈయన అనేక సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. ఇక కూలీ సినిమాలో కూడా అనేక సినిమాల్లో హీరోగా నటించిన నాగార్జున ని విలన్ గా ఎంపిక చేయడంతో లోకేష్ మరోసారి మాస్టర్, విక్రమ్ మూవీల రిఫరెన్స్ వాడాడు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: