
ఇందులో ఒక తెగ కనిపించడంతో పాటు, వారికి ఓ నాయకుడు కూడా కనిపిస్తున్నాడు. ముఖం స్పష్టంగా కనిపించకపోయినా, అతని డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ చూసి ఆయన ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రేక్షకుల్లో పుట్టింది. అయితే, ట్రైలర్ చూస్తే ఆ పాత్రను విజయ్ దేవరకొండే పోషిస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొంతమంది మాత్రం ఇది ఒక సర్ప్రైజ్ క్యామియో అని అంటున్నారు. విజయ్ డ్యుయల్ రోల్ చేస్తున్నారా? లేక ఇది ఫ్లాష్‌బ్యాక్ పాత్రా? అనే డౌట్లు ఇప్పుడు ఫ్యాన్స్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఇంతవరకు చిత్ర యూనిట్ ఈ విషయం పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
ఇక దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈసారి తన మార్క్‌కు భిన్నంగా మాస్ కంటెంట్‌తో వస్తున్నాడు. ఎమోషన్, రివెంజ్, విలేజ్ బ్యాక్‌డ్రాప్.. ఇవన్నీ కలగలసిన ప్యాకేజీగా ‘కింగ్డమ్’ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. విజయ్ లుక్ కూడా ట్రైబల్ టచ్‌తో విభిన్నంగా ఉంది. ఆ డిఫరెంట్ గెటప్‌లో తారక్ రేంజ్ మాస్ లుక్ తీసుకొచ్చారు అని చెప్పొచ్చు.ఈ సినిమా జూలై 31న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుండటంతో, ఇంకా డే్స్ ఉండగానే థియేటర్ల వద్ద విజయ్ ఫ్యాన్స్ హంగామా షురూ చేసేశారు. మరి ఈ సర్ప్రైజింగ్ క్యారెక్టర్ ఎవరిదో తెలుసుకోవాలంటే.. ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!