బాలీవుడ్‌లో అత్యంత భారీ చిత్రాలలో ఒకటిగా తెరకెక్కుతున్న "వార్ 2" సినిమా బడ్జెట్ సినీ వర్గాలలో పెద్ద చర్చకు దారితీసింది. దాదాపు 400 కోట్లతో రూపొందుతున్న ఈ చిత్రం, బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

నివేదికల ప్రకారం, ఈ భారీ బడ్జెట్‌లో నటీనటుల పారితోషికాలు, అధునాతన విజువల్ ఎఫెక్ట్స్, విదేశీ లొకేషన్లలో చిత్రీకరణ,  భారీ యాక్షన్ సన్నివేశాల కోసం ఎక్కువ మొత్తం ఖర్చయినట్టు తెలుస్తోంది. వార్1 సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా  వార్2 సినిమా సులువుగా 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.  దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆయన దర్శకత్వంలో గతంలో వచ్చిన "బ్రహ్మాస్త్ర" కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన విషయం తెలిసిందే.

విజువల్ ఎఫెక్ట్స్, భారీ చేజింగ్ సీక్వెన్స్‌లు, హై-ఆక్టేన్ స్టంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు 80 కోట్ల రూపాయలకు నాగవంశీ సొంతం చేసుకున్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.

400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి. వార్2 అన్ని భాషల ట్రైలర్లకు ఏకంగా 90 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.  జూనియర్ ఎన్టీఆర్సినిమా కోసం 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్నారు. ఒక డబ్బింగ్ మూవీకి ఈ స్థాయిలో పారితోషికం అందుకోవడం రికార్డ్ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: