టాలీవుడ్ ఇండస్ట్రీ లో కొంత మంది స్టార్ హీరోలు నటించిన సినిమాలకు నెగటివ్ టాక్ వచ్చిన అదిరిపోయే రేంజ్ కనెక్షన్లు కొంత మంది హీరోల సినిమాలకు వస్తూ ఉంటాయి. అందుకు ప్రధాన కారణం వారి సినిమాలపై ప్రేక్షకుల్లో సాధారణం గానే భారీ అంచనాలు ఉండడం , అలాగే వారికి అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం. ఇలా వారు నటిస్తున్నారు అనే సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న సందర్భంలో మరియు వారికి అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో వారు నటించిన సినిమాలకు నెగిటివ్ టాక్ వచ్చిన మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్లు వస్తూ ఉంటాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో నెగిటివ్ టాక్ తో కూడా భారీ కలెక్షన్లను రప్పించ గలిగిన కెపాసిటీ ఉన్న హీరోలలో పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ కూడా ముందు వరసలో ఉంటారు. వీరు నటించిన ఎన్నో సినిమాలు నెగిటివ్ టాక్ తో కూడా అద్భుతమైన కలెక్షన్లను  వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కొంత కాలం క్రితం రామ్ చరణ్ "గేమ్ చెంజర్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే నెగటివ్ టాక్ వచ్చింది. కానీ ఈ మూవీ కి మొదటి రోజు భారీ కలెక్షన్లు వచ్చాయి. తాజాగా పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది సినిమాకు కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా కూడా భారీ మొదటి రోజు భారీ కలక్షన్లను  రాబట్టింది.

గేమ్ చెంజర్ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 92.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కగా  , హరిహర వీరమల్లు సినిమాకు 70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇప్పటివరకు ఈ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను  వసూలు చేసిన టాప్ 10 ఇండియన్ మూవీస్ లలో గేమ్ చేంజర్ మొదటి స్థానంలో కొనసాగుతూ ఉండగా , హరిహర వీరమల్లు సినిమా రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఇలా ఈ రెండు సినిమాలు నెగిటివ్ టాక్ ను తెచ్చుకున్న కూడా మొదటి రోజు కలెక్షన్ల విషయంలో అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: