గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొంత కాలం క్రితం గేమ్ చెంజర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదల ఆయన  ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. ప్రస్తుతం చరణ్ , బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... శివ రాజ్ కుమార్ , జగపతి బాబు , దివ్యాందు ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని వృద్ధి సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొంత కాలం క్రితం అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయడంతో ఈ మూవీ బృందం కూడా ఆ తేదీకి ఈ సినిమాను కచ్చితంగా విడుదల చేయాలి అనే ఉద్దేశంతో ఈ సినిమా యొక్క షూటింగ్లో పక్కా ప్లానింగ్ తో ఫుల్ స్పీడుగా పూర్తి చేస్తూ వస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఆల్మోస్ట్ 50% షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన 50 శాతం షూటింగ్ను కూడా చాలా త్వరగా పూర్తి చేయాలి అని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కానీ తాజాగా మాత్రం పెద్ది సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. అందుకు కారణం భారీ వర్షాలు అని సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉండడంతో సినిమా షూటింగ్ కష్టం అనే ఉద్దేశంతో ఈ మూవీ షూటింగ్ను కొన్ని రోజుల పాటు ఆపి వేసినట్లు , వర్షాలు తగ్గగానే మళ్లీ ఈ మూవీ షూటింగ్ను స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి మాత్రం పెద్ది సినిమాపై మెగా ఫ్యాన్స్ తో పాటు మామూలు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: