ప్రముఖ కన్నడ నటి రమ్య పైన హీరో దర్శన్ అభిమానులు బూతులతో విరుచుకుపడుతున్నారు. నిన్నటి రోజు నుంచి సోషల్ మీడియాలో ఈమె పైన చాలా అసభ్యకరమైన సందేశాలను కూడా వైరల్ గా చేస్తున్నారు .అంతేకాకుండా ఈమెను అత్యాచారం చేస్తామంటూ బెదిరిస్తున్నారట. ఈ విషయాలను సైతం బహిర్గతం చేసిన నటి రమ్య, హీరో దర్శన్ అభిమానుల పైన కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఈ విషయం పైన చాలా ఫైర్ అయినట్టుగా సమాచారం. నటి రమ్యకు కూడా పోలీసుల మద్దతు ఇస్తామంటూ హామీ ఇచ్చారట.


రమ్య కు ఇలాంటి బెదిరింపు కాల్స్ , అశ్లీల  సందేశాలు పంపించిన వారిపైన చర్యలు తీసుకుంటామంటూ తెలిపారు. మాజీ ఎంపీ, సినీ నటి అయినప్పటికీ కూడా రమ్య కు సోషల్ మీడియాలో ఇలాంటి అవమానకరమైన పోస్టులు చేయడం చాలా దారుణమని.. ఇది మహిళలను ఇబ్బందులలోకి గురయ్యేలా చేస్తుందంటూ ఆ రాష్ట్ర కమిషన్ తీవ్రస్థాయిలో ఈ విషయం పైన చర్యలు తీసుకోబోతున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి వాటిని పోస్ట్ చేసిన సందేశాలను వెంటనే డిలీట్ చేయించి, పోస్ట్ పెట్టిన వ్యక్తుల పైన చర్యలు తీసుకోవాలని అంటూ మహిళా కమిషన్ చైర్ పర్సన్ అయినా నాగలక్ష్మి లేఖలో తెలియజేశారు.


గత కొద్దిరోజులుగా సుప్రీంకోర్టులో హీరో దర్శన్ బెయిల్ పైన విచారణ జరుగుతోంది.దీనిపైన రాజకీయ నాయకురాలు నటి రమ్య స్పందించింది భారతదేశంలో సామాన్య ప్రజలకు సుప్రీం కోర్టు న్యాయం చేస్తుందని భావిస్తూ ఉంటారు.. రేణుక స్వామి కుటుంబానికి కూడా న్యాయం జరుగుతుందని ఆశ ఉన్నది అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టుని షేర్ చేసింది.. దీంతో దర్శన అభిమానులు ఈమె పైన రెచ్చిపోతూ అసభ్యకరమైన సందేశాలను పంపిస్తూ వేధిస్తున్నారట. ఈ సంఘటన పైన కొంతమంది దర్శన్ అభిమానులు కూడా ఆమెకు(రమ్య ) కు మద్దతు పలుకుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: