తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన నిర్మాతలలో సూర్య దేవర నాగ వంశీ ఒకరు. ఈయన చాలా కాలం నుండి సినిమాలను నిర్మిస్తూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈయన నిర్మించిన సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకుంటూ వస్తున్నాయి. దానితో నిర్మాతగా ఈయనకు సూపర్ సాలిడ్ క్రేజ్ వచ్చింది. ఇకపోతే నాగ వంశీ కేవలం స్టార్ హీరోలతో పెద్ద సినిమాలను నిర్మించడం మాత్రమే కాకుండా చిన్న హీరోలతో లో బడ్జెట్ సినిమాలను కూడా నిర్మిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు. నాగ వంశీ కొంత కాలం క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీ లీల , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం అనే సినిమాను రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చాక ఈ సినిమాలో పూజ హెగ్డే , శ్రీ లీల హీరోయిన్లుగా కనిపించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కొంత కాలం తర్వాత ఈ సినిమా నుండి పూజా హెగ్డే తప్పుకున్నట్లు  మేకర్స్ ప్రకటించారు. దానితో ఈ మూవీ లో పూజ హెగ్డే హీరోయిన్గా నటించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా నాగ వంశీ "గుంటూరు కారం" సినిమా నుండి పూజా హెగ్డే ను ఎందుకు తీసేసాం అనే దాని గురించి క్లారిటీ ఇచ్చాడు.

తాజాగా నాగ వంశీ మాట్లాడుతూ ... గుంటూరు కారం సినిమా అనుకున్న తర్వాత అందులో హీరోయిన్గా పూజ హెగ్డే ను అనుకున్నాం. కానీ మేము అనుకున్న సమయానికి ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ కాలేదు. దానితో పూజా హెగ్డే వేరే సినిమాలకు కమిట్ అయింది. మేము షూటింగ్ స్టార్ట్ చేసే సమయానికి ఆమె వేరే మూవీ లతో బిజీగా ఉండడం వల్ల ఆ మూవీలకు డిస్టర్బ్ కాకుండా , మా సినిమాకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అనుకొని మేము పూజ హెగ్డేను సినిమాలో తీసుకోలేదు. అందుకు ఆమె కూడా అంగీకరించింది అని నాగ వంశీ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: