
మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం క్రితమే మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ మూవీ లో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని మాత్రం మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీ తో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మరో సినిమాలో కూడా హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో నయన తార హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్ గా కంప్లీట్ అవుతుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చిరంజీవి కొంత కాలం క్రితం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ మూవీకి కమిట్ అయ్యాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఈ సినిమా షూటింగ్ కూడా మరి కొంత కాలం లోనే ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే చిరంజీవి తో వాల్టేరు వీరయ్య మూవీ ని రూపొందించిన బాబి కొల్లి దర్శకత్వంలో చిరు మరో మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే చిరు , బాబి కాంబో మూవీ శ్రీకాంత్ ఓదెల మూవీ కంటే ముందే ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా చిరంజీవి ఓ రెండు సినిమాలలో నటిస్తూనే మరో రెండు సినిమాలను కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది.