ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన నమ్మకాలు ఉంటాయి. అలా బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కి కూడా ఒక మూఢనమ్మకం ఉందట. అయితే ఈ విషయాన్ని స్వయంగా షారుక్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.అది నా మూఢనమ్మకమని,సెంటిమెంట్ అంటూ చెప్పారు.మరి ఇంతకీ కోట్ల ఆస్తి సంపాదించిన షారుక్ ఖాన్ కి ఉన్న ఆ మూఢనమ్మకం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన సెంటిమెంట్ ఉంటుంది. సెంటిమెంట్ లేని వాళ్ళు ఎవరు ఉండరు. కొంతమందికి ఓ రంగు డ్రెస్ వేసుకుంటే కలిసి వస్తుంది.మరికొంతమందికి ఓ లక్కీ నెంబర్ ఉంటుంది.ఇంకొంతమందికి ఏదైనా దేవుడి సెంటిమెంట్ ఉంటుంది. మరికొంతమంది ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ దేవున్ని దర్శిస్తే తమకు అంతా శుభమే కలుగుతుంది అని సెంటిమెంట్ ఫాలో అవుతూ ఉంటారు.

అయితే సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది హీరోలు కూడా ఇలాంటి సెంటిమెంట్లనే ఫాలో అవుతారు.వారిలో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కూడా ఒకరు. అయితే షారుక్ ఖాన్ తనకి ఉన్న మూఢనమ్మకం ఏంటో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. షారుఖ్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటినుండి ఓ మూఢనమ్మకం పట్టుకుంది. అదేంటంటే నేను ఏ సినిమాలో అయితే పరిగెత్తుతానో ఆ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంటుంది. అయితే ఈ విషయాన్ని నేను చాలా సినిమాల్లో గమనించాను. అందుకే నా ప్రతి సినిమాలో ఈ పరుగు ఉండాలి అని అనుకుంటాను. ఇప్పటికే నేను నటించిన దిల్ వాలే దుల్హనియా లే జాయెంగే, కభీ ఖుషి కభీ గమ్, కరణ్ అర్జున్, డర్  వంటి సినిమాల్లో పరిగెత్తే సీన్ ఉంటుంది..

 అలా నేను ఈ మూఢనమ్మకాన్ని ఫాలో అవుతూ వస్తున్నాను.ఏ సినిమాలో అయితే పరిగెత్తుతానో ఆ సినిమా హిట్ కావడంతో దీన్ని సెంటిమెంట్ గా నమ్ముతున్నాను. ఆ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద హిట్లుగా నిలిచాయి.. అంటూ షారుక్ ఖాన్ తాను నటించిన కోయిల మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని బయట పెట్టారు. ఇక ఈ కోయిల మూవీలో కూడా ఆయన ఓ సీన్లో పరిగెత్తారు. ఇది కూడా హిట్ అయింది. అలాగే చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో కూడా షారుక్ ఖాన్ పరిగెత్తుతారు.అది కూడా హిట్టే.. అలా అప్పటినుండి ఇప్పటివరకు షారుఖ్ ఖాన్ ఈ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ వస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: