కొంత కాలం క్రితం నితిన్ హీరో గా కృష్ణ చైతన్య అనే దర్శకుడు పవర్ పేట అనే టైటిల్ తో ఓ మూవీ ని రూపొందించాలి అని అనుకున్నాడు. ఇక దానికి నితిన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు నిర్మించనున్నట్లు వార్తలు వచ్చాయి. దానితో నితిన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై పవర్ పేట అనే సినిమా స్టార్ట్ అవుతుంది అని బలంగా వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ కాంబో మూవీ క్యాన్సల్ అయింది.

దానితో కృష్ణ చైతన్య , విశ్వక్ సేన్ హీరో గా హీరోగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాను రూపొందించాడు. ఈ సినిమా చాలా కాలం క్రితమే విడుదల అయింది. ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. తాజాగా పవర్ పేట మూవీ కి సంబంధించిన వార్తలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... కృష్ణ చైతన్య ఈ సారి పవర్ పేట అనే మూవీ ని నితిన్ తో కాకుండా టాలీవుడ్ యువ నటుడు అయినటువంటి సందీప్ కిషన్ తో చేయాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా సందీప్ కిషన్ కి కృష్ణ చైతన్య "పవర్ పేట" మూవీ కథను వినిపించగా , ఆయనకి పవర్ పేట మూవీ కథ బాగా నచ్చడంతో ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సందీప్ కిషన్ హీరో గా కృష్ణ చైతన్య దర్శకత్వం లో రూపొందబోయే పవర్ పేట మూవీ ని 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఆగస్టు 9 వ తేదీన ఘనంగా ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సందీప్ కిషన్ నటించిన చాలా సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి. మరి పవర్ పేట మూవీ తో ఈ నటుడు ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

sk