గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొంత కాలం క్రితం శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చెంజర్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం చరణ్ , బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శివ రాజ్ కుమార్ , జగపతి బాబు , దివ్యాందు ఈ మూవీ లో కీలకమైన పాత్రలలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పడ్ గా జరుగుతుంది.

ఈ సినిమాను వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ తర్వాత చరణ్ , టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇప్పటికే చరణ్ , సుకుమార్ కాంబో లో రంగస్థలం అనే మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. దానితో వీరి కాంబోలో రూపొందేవుడు నెక్స్ట్ మూవీ పై ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే చరణ్ కి సుకుమార్ ఓ కథను చిన్న లైన్ గా వినిపించినట్లు , అది అద్భుతంగా చరణ్ కి సూపర్ గా నచ్చినట్లు తెలుస్తుంది.

ఇక పెద్ది సినిమా కంప్లీట్ అయ్యే లోపు చరణ్ కు చిన్న లైన్ గా చెప్పిన కథను పూర్తిగా డెవలప్ చేయాలి అనే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఏకంగా అమెరికాలో చరణ్ మూవీ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పనులను సుకుమార్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఈయన తన టీం మొత్తాన్ని అమెరికాకు తీసుకు వెళ్లి అక్కడ చరణ్ తో చేయబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే మొత్తం స్క్రిప్ట్ ను సుకుమార్ లాక్ చేయబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: