
ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ నిర్మాతలు తీసుకున్న ఒక నిర్ణయం ఈ మూవీకి చాల మంచి జరుగుతుందని అంచనాలు వస్తున్నాయి. ఈమధ్య కాలంలో క్రేజీ హీరోల సినిమాలకు విడుదలకు ముందురోజు ప్రీమియర్ షోలు వేయడం ఒక అలవాటుగా మారింది. గతవారం ‘హరి హర వీరమల్లు’ విడుదలకు ముందురోజు కూడ ఇలా ప్రీమియర్ షోలు వేశారు.
ఆ ప్రీమియర్ షోలకు టిక్కెట్ రేట్లు ఎక్కువగా పెట్టినప్పటికీ ఆ మూవీ పైన ఉన్న క్రేజ్ రీత్యా తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలలో వీర మల్లు ప్రీమియర్ షోలకు భారీ స్పందన రావడంతో పాటు కలక్షన్స్ కూడ అత్యంత భారీగా వచ్చాయి. అయితే ఆ ప్రీమియర్ షోలకు పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు అనేకమంది సాధారణ ప్రేక్షకులు కూడ రావడంతో అసినిమా పై ప్రీమియర్ షో నుండి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది.
దీనితో తెల్లవారేసరికి వీరమల్లు అంచనాలు తలక్రిందులు చేస్తూ ఆ మూవీ పై ప్రీమియర్ షో నుండి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ కావడంతో తెల్లవారే సరికి ‘హరి హర వీరమల్లు’ ఈ మూవీకి తీవ్ర నష్టం జరిగింది అన్న కామెంట్స్ కొందరు చేస్తున్నారు. దీనితో ఎలక్ట్ అయిన ‘కొంగ డమ్’ మూవీ నిర్మాతలు వ్యూహాత్మకంగ వ్యవహరిస్తూ విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ మూవీకి విడుదలకు ముందురోజు స్పెషల్ షోలు వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనితో ఈ మూవీ టాక్ ముందటిరోజు మార్నింగ్ షో పూర్తి అయినప్పుడు మాత్రమే ‘కొంగ డమ్’ పై ప్రేక్షకుల తీర్పు ఎలా ఉండబోతుంది అన్న కామెంట్స్ వినబడుతున్నాయి..