టాలీవుడ్ డైరెక్టర్లలో విభిన్నమైన చిత్రాలకు పెట్టింది పేరు  డైరెక్టర్ కృష్ణరెడ్డి. ఈయన డైరెక్షన్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కమెడియన్ ఆలీతో యమలీల వంటి సినిమాని తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈయన దర్శకత్వం వహించిన మాయలోడు సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో హీరోగా రాజేంద్ర ప్రసాద్ నటించిన రాజేంద్రప్రసాద్ కు జోడిగా సౌందర్య నటించింది. ఈ చిత్రంలో చినుకు చినుకు సాంగ్ ఒక సెన్సేషనల్ గా మారింది.


ఈ సాంగ్ కోసమే సినిమా థియేటర్లకు భారీగా ఆడియన్స్ వెళ్లేవారు. ఈ సాంగ్ కారణంగానే 365 రోజులపాటు ఈ సినిమా ఆడిందని గతంలో బాబు మోహన్ కూడా వెల్లడించారు. అయితే ఇదే పాటను మళ్ళీ శుభలగ్నం చిత్రంలో ఆలీ, సౌందర్యలతో తెరకెక్కించారు కృష్ణరెడ్డి. మాయలోడు చిత్రంలో మాత్రం ఈ పాట బాబు మోహన్, సౌందర్య మధ్య వస్తుంది. అయితే ఈ సాంగ్ విషయంపై కృష్ణరెడ్డి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.


ఈ సాంగ్ విషయంలో హీరో రాజేంద్రప్రసాద్ ఇబ్బంది పెట్టారని అందుకే బాబుమోహన్ తో చేయాల్సి వచ్చింది తెలిపారు. నువ్వు డాన్స్ చేస్తావట కదా.. స్టెప్పులేస్తావట కదా.. అంటూ తన మీద సెటైర్స్ వేశారని దీంతో కొంచెం బాధగా అనిపించిందని.. అలాగే మాయలోడు సినిమా చివరి స్టేజ్ లో ఉన్న సమయంలో రాజేంద్రప్రసాద్ డేట్స్ అడ్జస్ట్ చేయలేదు.. డేట్స్ తక్కువగా ఇవ్వడంతో ఇంకొన్ని రోజులు అడగగా ఆయన సహకరించలేదు.. బ్రతిమలాడినా కూడా వినలేదని.. చివరికి ఆయన ఇచ్చిన డేట్లలో డబ్బింగ్ పూర్తి చేశాను కేవలం ఒక్క సాంగ్ మాత్రమే మిగిలిపోవడంతో ఎలా చేస్తావో చూస్తానని రాజేంద్రప్రసాద్ అన్నారట.

ఆ వెంటనే కృష్ణారెడ్డి ఆ పాటను బాబుమోహన్ తో తీయాలని ఫిక్స్ అయ్యారు.. ఆ విషయం తెలుసుకున్న రాజేంద్రప్రసాద్ చివరికి తానే చేస్తానని వచ్చినప్పటికీ లేదు తాను బాబు మోహన్ కి మాట ఇచ్చాను ఆయనతోనే చేస్తానని కృష్ణరెడ్డి తెగేసి చెప్పారట. అలా తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు కృష్ణరెడ్డి. అయితే తాను ఎదగడానికి కారణం కూడా రాజేంద్రప్రసాద్ సహకారం వల్లే అంటూ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: