పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు సినిమా ఈనెల 24న విడుదల అయ్యింది. 17వ శతాబ్దంలోని మొఘల్ పాలన నేపథ్యంలో.. మొఘల్ చక్రవర్తి, ఔరంగజేబు ఆగడాలను సైతం ప్రధానంగా ఈ చిత్రంలో చూపించారు. అలాగే కోహినూర్ వజ్రం చుట్టూ తిరిగే కధాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వాస్తవానికి డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రాన్ని మొదలుపెట్టగా కొన్ని కారణాల చేత మధ్యలో తప్పుకోవడంతో ఏ.ఎం. రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వ భాద్యతలను తీసుకొని సినిమాను పూర్తి చేశారు.


అయితే చివరిలో పవన్ కళ్యాణ్సినిమా కోసం చాలా గట్టిగానే ప్రమోషన్స్ చేశారు. ఓపెనింగ్ కలెక్షన్స్ భారీగానే రాబట్టాయి. ఇదంతా ఇలా ఉండగా ఇందులో నటించిన నటీనటుల రెమ్యూనరేషన్ తాజాగా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా చిత్రాలకు సంబంధించి ఎక్కువగా హీరోలకే రెమ్యూనరేషన్ అధికంగా ఉంటుంది. కానీ హరిహర వీరమల్లు చిత్రానికి చాలా తక్కువగానే రెమ్యూనరేషన్(20 కోట్లు) తీసుకున్నారట పవన్ కళ్యాణ్. ఇందులో కూడా తిరిగి మళ్లీ 8 కోట్లు వెనక్కి ఇచ్చినట్లు సమాచారం.


మరో నటుడు బాబీ డియోల్ ఔరంగజేబ్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రం కోసం రూ.3కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. అలాగే హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా 2.5 కోట్ల రూపాయలు అందుకున్నట్లు వినిపిస్తోంది. ఇక మిగిలిన ఆర్టిస్టులు నాజర్, రఘుబాబు, సునీల్ తదితర నటీనటులు వారి యొక్క కాల్షిట్లను బట్టి లక్షలలో, వేళ్లలో  తీసుకున్నట్లు వినిపిస్తోంది. అయితే ఇలా నటీనటుల రెమ్యూనరేషన్ బడ్జెట్ పరంగా పెద్దది కాలేదు కానీ కేవలం గ్రాఫిక్స్ కే ఎక్కువ బడ్జెట్ అయ్యిందని వినికిడి. ఇప్పటివరకు హరిహర వీరమల్లు సినిమా రూ .100 కోట్లకు రూపాయలను మాత్రమే రాబట్టింది. అంటే బడ్జెట్లో 50 శాతం వరకు రాబట్టినట్లు వినిపిస్తున్నాయి. ఇటీవలే కలెక్షన్స్ పరంగా కూడా భారీగా తగ్గిపోయినట్లు టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: