మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. గతంలో రవితేజ , శ్రీ లీల కాంబోలో ధమాకా అనే సినిమా వచ్చింది. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఇలా ఇప్పటికే రవితేజ , శ్రీ లీల కాంబోలో రూపొందిన ధమాకా మూవీ మంచి విజయం సాధించి ఉండడంతో మాస్ జాతర సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ ని ఆగస్టు 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. తాజాగా రవితేజమూవీ కి సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇకపోతే రవితేజ నటించిన చాలా సినిమాలు ఈ మధ్య కాలంలో బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఆఖరిగా రవితేజ కు ధమాకా మూవీ తో విజయం దక్కింది. ఈ మూవీ తర్వాత ఈయన నటించిన ఏ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోలేదు. మాస్ జాతర సినిమాపై రవితేజ అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. మాస్ జాతర సినిమా సెట్స్ పై ఉండగానే  రవితేజ , కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ మూవీ ని మొదలు పెట్టాడు. 

మూవీ షూటింగ్ కూడా ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ ని కచ్చితంగా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయాలి అనే ప్లానింగ్ తో ఈ మూవీ యొక్క షూటింగ్ను మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా రవితేజ ప్రస్తుతం మాస్ జాతర సినిమాకు సంబంధించిన ఫైనల్ పనుల్లో బిజీగా ఉంటూనే కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

rt