
ఈ సందర్భంగా కాజోల్ మాట్లాడుతూ.. అందంగా లేనివారు అందంగా కనిపించాలని అనుకోవడంలో ఎలాంటి తప్పులేదు కదా కెమెరా ముందు నటించే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా అందం కోసం ప్రయత్నాలు చేయడంలో ఎలాంటి తప్పులేదని తెలిపింది కాజోల్. అలాంటి వారిని ఏ విధంగా కూడా జడ్జ్ చేయకూడదని తెలిపింది. ఈ విషయంలో తమ మద్దతు కూడా ఉంటుందంటూ తెలిపింది కాజోల్. అలాగే వయసు గురించి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో తను వయసు గురించి సోషల్ మీడియాలో ఒక సమస్యగా మారింది అంటూ తెలిపింది... నా దృష్టిలో ఏజ్ అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే.. ఎంతో అద్భుతమైన జీవితాన్ని గడపడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు మిగిలి ఉన్నాయ్ అనే విధంగా తెలిపింది.
అందం కోసం కాస్మెటిక్ సర్జరీలు చేయించుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదని.. ఈ విషయంలో మహిళలని బ్లేమ్ చేయడం తప్పు అంటూ తెలిపింది. ఈమధ్య చాలామంది పురుషులు కూడా వీటిని చేయించుకుంటున్నారు ఇది నిజం అంటూ తెలియజేసింది. కెమెరా ముందు ఉండేవారు తమని బాగా ప్రజెంట్ చేసుకోవడం కోసమే ఇలా అందం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారిని విమర్శించకూడదు అంటూ తెలిపింది. ప్రస్తుతం కాజోల్ మాట్లాడిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.