కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో ఏ ఆర్ మురుగదాస్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో రూపొందించిన సినిమాలు ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. దానితో ఈయన దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టిన అత్యంత తక్కువ కాలం లోనే స్టార్ దర్శకుడు స్థాయికి ఎదిగాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన చాలా సినిమాలు ప్రేక్షకులను అలరించడంలో విఫలం అవుతున్నాయి. ఈయన కొంత కాలం క్రితం బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సాల్మన్ ఖాన్ హీరో గా సికిందర్ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని రష్మిక మందన హీరోయిన్గా నటించింది.

సినిమా భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో భారీగా విఫలం అయింది. తాజాగా మురగదాస్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా హిందీ సినిమాల గురించి ఈయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా మొరగదాస్ మాట్లాడుతూ ... హిందీ సినిమాలు తెరకెక్కించే విషయంలో నేను భాష విషయంలో కాస్త గందరగోళానికి గురి అయ్యాను. నా మాతృభాష తమిళ్. తమిళ్ లో సినిమాలు రూపొందించడం విషయంలో నేను చాలా పర్ఫెక్ట్ గా ఉంటాను.

అలాగే తమిళ్లో సినిమాలను రూపొందించే సమయంలో నేను ఎంతో బలంగా కూడా ఉంటాను. యువతకు ఎలాంటి డైలాగ్స్ నచ్చుతాయి , ఫ్యామిలీకి ఎలాంటి డైలాగులు నచ్చుతాయి అనే విషయంలో నాకు పక్క పర్ఫెక్షన్ ఉంది. తెలుగులో కూడా కాస్త పర్వాలేదు అనే స్థాయిలో సినిమాలు చేయగలను. కానీ హిందీ సినిమాల విషయంలో మాత్రం అది పూర్తిగా రాంగ్ అయింది అని మురుగదాస్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మురుగదాస్  తమిళ నటుడు శివ కార్తికేయన్ హీరోగా మదరాశి అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా కూడా మరికొంత కాలంలో విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: