తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి సినిమాతోనే అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకున్న యువ నటీమణులలో భాగ్య శ్రీ బోర్స్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ మాస్ మహారాజా రవితేజ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ బచ్చన్ అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయినా కూడా ఈ మూవీ లో భాగ్య శ్రీ బోర్స్ తన అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వచ్చింది. దానితో ఈ సినిమా విడుదల అయిన తర్వాత ఈమెకు వరస పెట్టి క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కాయి.

దానితో ప్రస్తుతం ఈమె చేతి నిండా సినిమాలతో అత్యంత బిజీగా కేరిర్ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్డమ్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ లో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని రేపు అనగా జూలై 31 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ పాత్రకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమాలో ఈమె గ్లామర్ పాత్ర చేసి ప్రేక్షకులను అలరించడం కాకుండా ఈ ముద్దుగుమ్మ ద్వారానే సినిమా ముందుకు నడవనున్నట్లు , ఈమె వాయిస్ ఓవర్ తోనే సినిమా కథ మొత్తం ముందుకు సాగనున్నట్లు , అలాగే ఈమెకు ఈ సినిమాలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పాత్ర దక్కినట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈమెకు మంచి పాత్ర ఈ సినిమాలో దక్కి , ఆ మూవీ కూడా మంచి విజయం సాధించినట్లయితే ఈమె క్రేజ్ తెలుగులో మరింత పెరిగే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bsb