పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి నటుడు ప్రకాష్ రాజ్ కి మధ్య గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియా వార్ జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.అయితే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ చెప్పుకు తిరగడం ప్రకాష్ రాజ్ కి అస్సలు నచ్చదు. అందరూ ఒక్కటే అన్నట్లుగా చూడాలి అని ప్రకాష్ రాజ్ అంటూ ఉంటారు.అయితే జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పై సంధించే ప్రశ్నలు అన్ని ఇన్నీ కావు.ఇది ఇలా ఉంటే ఇన్ని రోజులుగా ట్విట్టర్ లోనే ఆయనపై పోస్టులు పెట్టిన ప్రకాష్ రాజ్ ఈసారి ఏకంగా ఓ ఇంటర్వ్యూ లోనే మండిపడ్డారు. ప్రకాష్ రాజ్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఒక దొంగ.. ఆయన అభిమానులకి దర్శక నిర్మాతలకి ద్రోహం చేశారు. అభిమానులను హరిహర వీరమల్లు సక్సెస్ మీట్ లో సైలెంట్ గా ఉండకండి తిరిగి కొట్టండి అంటూ రెచ్చగొట్టాడు. 

ఈ మాటలు దేనికి అర్థం. నీ అభిమానులైతే ఒకలా వేరొకరి అభిమానులైతే మరోలా చెబుతావా.. మహేష్ బాబు లాంటి హీరో సరిలేరు నీకెవ్వరు ఈవెంట్లో హీరోలమంతా ఒకటే..మా కోసం మీరు కొట్టుకోకండి అంటూ మనమంతా ఒక్కటే అనే భావాన్ని తీసుకువచ్చారు. కానీ నువ్వు మాత్రం అభిమానులకు ఏం నేర్పుతున్నవు. నీ చేతకానితనంతో హరిహర వీరమల్లు నిర్మాతకు అన్యాయం చేశావు.సినిమా ప్రమోషన్ కోసం పది రోజులు తిరిగే బదులు సినిమానే అనుకున్న సమయానికి పూర్తి చేస్తే నిర్మాతకు డబ్బులు అన్నా వచ్చేవి.ఇన్ని రోజులు సినిమాని వాయిదా వేస్తూ వచ్చి నిర్మాతకు తీరని అన్యాయం చేశావు. అసలు హరిహర వీరమల్లు సినిమాలో ఏం కథ ఉంది. నీ చేష్టలు భరించలేకే ఓ దర్శకుడు పక్కకు తప్పుకున్నాడు.'

 మరో దర్శకుడు నైనా సరిగ్గా చేయనిచ్చావా? ఆ  కథలో కూడా వేలు పెట్టి నీ రాజకీయాన్ని బలవంతంగా అందులో పులిమావు. తీరా రిజల్ట్ ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. సినిమా చూసి వచ్చాక నీ అభిమానులే మోసపోయామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నువ్వు అభిమానులకు తీరని ద్రోహం చేశావు. ఎంతసేపు నీ రాజకీయాల గురించి నీ స్వార్థం గురించే ఆలోచిస్తావు.నీకున్న అహంకారం వల్లే సినిమాకి ఐదు సంవత్సరాలు పట్టింది.. నీవు మనస్సాక్షి లేని దొంగవి. నీ సొంత అభిప్రాయాలను ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నావు.. అంటూ ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్లు చేశారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి దీనిపై పవన్ కళ్యాణ్ కౌంటర్ ఎలా ఉంటుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: