మాస్ మహారాజా రవితేజ ఆఖరుగా మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ కంటే ముందు కూడా రవితేజ నటించిన పలు సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యాయి. ఆఖరుగా రవితేజ కు ధమాక సినిమాతో మంచి విజయం దక్కింది. ఈ మూవీ తర్వాత ఈయన నటించిన అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యాయి. ప్రస్తుతం రవితేజ "మాస్ జాతర" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు.

మూవీ ని ఆగస్టు 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. దీనితో రవితేజ సినిమా విడుదల తేదీ కన్ఫామ్ అయ్యింది అని ఆయన అభిమానులు ఎంతో ఆనంద పడ్డారు. కానీ ఇంతలోనే వారికి ఓ డిసప్పాయింట్ న్యూస్ ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే  .. మాస్ జాతర సినిమా ఆగస్టు 27 వ తేదీన విడుదల కావడం కష్టం అని , ఈ మూవీ ని ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు అని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

దానితో రవితేజ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా రవితేజ "మాస్ జాతర" సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా ప్రారంభించాడు. దానితో ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం లేదు అని , ఈ సినిమా ఖచ్చితంగా ఆగస్టు 27 వ తేదీన విడుదల అవుతుంది అని కొంత మంది నమ్ముతున్నారు. మరి మాస్ జాతర సినిమా ఆగస్టు 27 వ తేదీన విడుదల అవుతుందా ..? లేదా ..? అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

rt