
ముఖ్యంగా బోల్డ్ గా ఉండడం అంటే అగౌరవంగా ప్రవర్తించినట్లు కాదు అంటూ తెలిపింది. ముఖ్యంగా తన డ్రెస్సింగ్ స్టైల్ ను కొంతమంది విమర్శిస్తూ ఉన్నారని నన్నెవరూ కామెంట్స్ చేసిన తాను సైలెంట్ గా ఉంటున్నానని.. కానీ నా జీవన విధానాన్ని విమర్శిస్తే మాత్రం కచ్చితంగా మాట్లాడుతానని తెలిపింది. కేవలం కొంతమంది సోషల్ మీడియా ఛానల్స్ తనని లక్ష్యంగా చేసుకొని.. కొన్ని వీడియోలలో మహిళలే నన్ను విమర్శించారంటూ తెలిపింది. వారెవరో నాకు తెలియదు.. నేనెవరో కూడా వారికి తెలియదు కానీ కేవలం నా వ్యక్తిగత విషయాల గురించే మాట్లాడుతూ ఉన్నారు.. నేను ఒక స్త్రీని, భార్యని కూడ ,ఇద్దరు పిల్లలు తల్లిని కాబట్టే నా స్టైల్ ని ప్రతిబింబించే దుస్తులను నేను ధరించడానికే ఆస్వాదిస్తానంటూ తెలిపింది అనసూయ.
కొంతమంది తల్లిగా తనని ప్రవర్తించలేదని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తల్లి కావడం అంటే మనల్ని మనం వదులుకోవడమా అంటూ ప్రశ్నించింది? నా భర్త, పిల్లలు తనని ప్రేమిస్తున్నారని వారు ఎప్పుడూ కూడా నన్ను జడ్జ్ చేయలేదని.. తనకు సపోర్టివ్ గానే చేశారని తెలిపింది.. ఇది చాలు విశ్వాసం, దయ, గౌరవం ఉన్న మహిళలను చూస్తూ తన ఇద్దరు పిల్లలు కూడా పెరుగుతున్నారంటూ అనసూయ కామెంట్స్ చేయడం జరిగింది. నా విలువలను ఎప్పుడు కోల్పోలేదని తెలియజేసింది అనసూయ. తనమీద ట్రోల్స్,కామెంట్స్ చేసేవారికి ఇలా గట్టి కౌంటర్ వేస్తోంది అనసూయ..