
అయితే... సంక్రాంతి వస్తే మాత్రం... క్షణం ఆలోచన చేయాల్సిందే! ఒకవేళ ఈ సినిమా 2026 సంక్రాంతి బరిలోకి దిగితే, పోటీ తారాస్థాయిలో ఉంటుంది. ఇప్పటికే పలు పెద్ద సినిమాలు బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాయి: చిరంజీవి157 – అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మాస్ మినిస్టర్ మూవీ ఫాస్ట్ ట్రాక్ లో ఉంది .. వెంకటేష్ స్పెషల్ రోల్ – ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా పూర్తయింది. అలాగే నవీన్ పోలిశెట్టి - అనగనగా ఒక రాజు – కమిటెడ్ సంక్రాంతి రిలీజ్. రవితేజ - అనార్కలి (అఫీషియల్ టైటిల్ ఖరారు కాకపోయినా ప్రచారంలో ఉంది) .. విజయ్ - జన నాయగన్ – జనవరి 9 న ఇప్పటికే రిలీజ్ డేట్ డిక్లేర్ . ఇంతటి పోటీలో ప్రభాస్ సినిమా రావాలంటే, దాన్ని తగ్గట్టే థియేటర్ స్పేస్ దొరకడం కూడా ఒక పెద్ద సమస్యే. పైగా గతంలో ప్రభాస్ సినిమాలు (బాహుబలి తరువాత) అన్నీ సోలో రిలీజ్ అయ్యేలా చూసినట్లే కనిపించింది.
ఇక ఇప్పుడు ఈ సినిమాను కూడా అదే లైన్‌లో తీసుకెళ్లాలని నిర్మాతల ఆలోచన ఉందని టాక్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పటికే పలు భాషల మార్కెట్లను టార్గెట్ చేస్తోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ మార్కెట్లను దృష్టిలో పెట్టుకుని విడుదలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పటికి డిసెంబర్‌కి పోటీ తక్కువ ఉంటే – అదే బెస్ట్ విండో. ప్రభాస్ మాస్ సినిమాలకు మాస్ రిలీజ్ విండో అవసరం. డిసెంబర్ 5 ఫిక్స్ అయితే పర్ఫెక్ట్. కానీ సంక్రాంతికి వస్తే రిస్క్ పక్కా. మరి మేకర్స్ గేమ్ ప్లాన్ ఏంటి? ఫ్యాన్స్ ఎలాంటి అధికారిక క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నారు. ‘ది రాజా సాబ్’ - డిసెంబర్ కి వస్తాడా? సంక్రాంతికీ దిగుతాడా? చివరికి రాజా నిర్ణయం ఏంటో వేచి చూడాల్సిందే!