టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ తాజాగా కింగ్డమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో భాగ్య శ్రీ బోర్స్ , విజయ్ కి జోడిగా నటించగా ... గౌతమ్ తిన్ననూరి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. సత్యదేవ్ ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ నిన్న అనగా జులై 31 వ తేదీన పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చింది.

దానితో ఈ మూవీ కి భారీ ఓపెనింగ్స్ మొదటి రోజు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని ఓ టీ టీ లో ఎవరైనా చూడాలి అనుకుంటున్నారా ..? అయితే మీరు చాలా కాలం వెయిట్ చేయాల్సిందే. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను ప్రముఖ ఓ టీ టీ సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ బృందం ఓ టీ టీ సంస్థతో ఈ సినిమా విడుదల అయ్యి నాలుగు వారాల థియేటర్ రన్ కంప్లీట్ అయిన తర్వాత ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దానితో ఈ సినిమా ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ ని ఎవరైనా థియేటర్లలో చూడాలి అంటే ఇంకా చాలా కాలమే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ మూవీ కి మంచి టాక్ రావడంతో ఈ సినిమా లాంగ్ రన్ లో భారీ కలెక్షన్లను  వసూలు చేసే అవకాశం చాలా వరకు ఉంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd