సినిమా ఇండస్ట్రీ లో గ్లామర్ తో నెట్టుకొచ్చే బ్యూటీల కంటే కూడా తమ నటనతో ప్రేక్షకులను అలరించే వారికే ఎక్కువ అవకాశాలు వస్తూ ఉంటాయి. అలాంటి వారే ఎక్కువ కాలం ఇండస్ట్రీ లో మంచి దశలో కెరియర్ను ముందుకు సాగించగలరు. కొంత మంది కి అద్భుతమైన నటన చేసే టాలెంట్ ఉన్నా కూడా వారికి అలాంటి పాత్రలు దొరకపోవడం వల్ల కూడా వారు నటన విషయంలో వేనకబడిపోతూ ఉంటారు. తెలుగు సినీ పరిశ్రమలోకి ఈ మధ్య కాలంలో అనేక మంది బ్యూటీలు ఎంట్రీ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే. అందులో కొంత మంది మాత్రమే కెరియర్ ప్రారంభంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు.

అలాంటి వారిలో భాగ్య శ్రీ బోర్స్ ఒకరు. ఈమె మిస్టర్ బచ్చన్ అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇందులో భాగ్య శ్రీ తన అందాలతో ప్రేక్షకులను అదిరిపోయే రీతిలో ఆకట్టుకుంది. కానీ ఈమెకు ఈ సినిమాలో నటనతో ఆకట్టుకునే స్కోప్ దొరకలేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ కింగ్డమ్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ నిన్న అనగా జూలై 31 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాలో అయినా ఈమెకు మంచి నటనకు స్కోప్ ఉన్న పాత్ర దొరికినట్లయితే ఈమె అద్భుతమైన స్థాయికి చేరుకుంటుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ మూవీ లో కూడా ఈమెకు పెద్దగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరకలేదు అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

ఇప్పటివరకు ఈమె తన అందాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కానీ ఈమె తన నటనతో మాత్రం ప్రేక్షకులను అలరించలేదు. ఈమె ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా రూపొందుతున్న ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ లో కనుక ఈమెకు గ్లామర్ తో పాటు నటనను ప్రదర్శించే పాత్ర కూడా దొరికినట్లయితే ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అదిరిపోయే రేంజ్ లో పెరుగుతుంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bsb