సినిమా ఇండస్ట్రీలో రిలీజ్ కష్టాలు ఎక్కువ శాతం చిన్న హీరోల సినిమాలకు, తక్కువ బడ్జెట్ సినిమాలకు ఉంటాయి అని చాలా మంది భావిస్తూ ఉంటారు. ఎందుకు అంటే చిన్న హీరోల సినిమాలకు తక్కువ బడ్జెట్ సినిమాలపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు ఉండవు. దానితో వారు ఒక తేదీని అనౌన్స్ చేశాక అదే తేదీన ఏదైనా స్టార్ హీరో సినిమా, అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమా తేదీ కూడా అనౌన్స్ అయినట్లయితే చిన్న సినిమాలు వెనక్కు తగ్గవలసి ఉంటుంది. లేదు అని వారితో పోటీపడినా కూడా థియేటర్లు పెద్ద స్థాయిలో దక్కకపోవడం, అలాగే ప్రేక్షకులు కూడా చిన్న సినిమాలను పెద్దగా పట్టించుకోకపోయే అవకాశం ఉంటుంది. దానితో చిన్న సినిమాలకు విడుదల కష్టాలు పెద్దగా ఉంటాయి అని చాలా మంది భావిస్తూ ఉంటారు.

కానీ ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలకు, అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలకు కూడా రిలీజ్ కష్టాలు వస్తున్నాయి. ఇక రిలీజ్ కష్టాలు ఎక్కువ శాతం స్టార్ హీరోల సినిమాలకు, మంచి క్రేజ్ ఉన్న సినిమాలకు షూటింగ్ డిలే కావడం, మరికొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వస్తున్నాయి. ఆ లిస్టులో చాలా సినిమాలు ఉన్నాయి. అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర అనే సినిమాను చాలా కాలం క్రితమే మొదలు పెట్టాడు. కానీ ఈ మూవీ కి భారీ గ్రాఫిక్స్ పనులు ఉండడంతో ఇప్పటివరకు ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ కన్ఫామ్ చేయలేదు. ఇక మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఆగస్టు 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

కానీ ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది అని ఓ వార్త వైరల్ అవుతుంది. ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా కూడా విడుదల పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం మార్చి 26 న విడుదల చేయనన్నట్లు మాత్రమే ప్రకటించారు. కానీ ఈ సినిమా కూడా మార్చి 26 న విడుదల కావడం కష్టం అని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలా మంచి క్రేజ్ ఉన్న హీరోల సినిమాలకు రిలీజ్ కష్టాలు వస్తున్నట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: