నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమాకి తాజాగా ఉత్తమ జాతీయ  అవార్డు లభించింది.ఈ అవార్డు వచ్చిందని ప్రకటించడంతో చాలామంది నందమూరి ఫ్యాన్స్,బాలకృష్ణ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అంతేకాదు అసలు సిసలైన నందమూరి హీరోవి అనిపించుకున్నావయ్యా అంటూ కామెంట్లు పెడుతున్నారు.మరి ఇంతకీ బాలకృష్ణ నటించిన ఏ సినిమాకి జాతీయ అవార్డు వచ్చిందంటే భగవంత్ కేసరి.. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో 2023లో వచ్చిన భగవంత్ కేసరి సినిమా అందరూ చూసే ఉంటారు. ఈ సినిమా థియేటర్లోనే కాదు టెలివిజన్ లో వచ్చిన ప్రతిసారి మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతోంది. బాబాయ్ కూతుర్ల అనుబంధం తెరమీద చూపిస్తూ ఈ సినిమాని తెరకెక్కించారు అనిల్ రావిపూడి.

ఈ సినిమాలో బాబాయ్ కూతురు మధ్య బాండింగ్ మాత్రమే కాదు మధ్య మధ్యలో కామెడీ పంచెస్ కూడా సినిమాకి మంచి హైప్ ఇచ్చాయి. సైన్ స్క్రీన్ ప్రొడక్షన్ బ్యానర్లో సాహుగారపాటి,హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా 2023 అక్టోబర్ 19న దసరా కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 120 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. అయితే అలాంటి ఈ సినిమాకి తాజాగా ఉత్తమ జాతీయ అవార్డు వచ్చింది.. తాజాగా 71 వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది.ఇందులో 2023 ఉత్తమ తెలుగు చిత్రం అవార్డుని భగవంత్ కేసరి మూవీ అందుకుంది.
ఇక ఈ సినిమాలో బాలకృష్ణకి కూతురు పాత్రలో శ్రీలీల నటించగా కాజల్ అగర్వాల్ బాలకృష్ణ సరసన నటించింది.. అలాగే ఉత్తమ తమిళ సినిమాగా పార్కింగ్ మూవీ కి అవార్డు రాగా.. ఉత్తమ కన్నడ సినిమాగా  కండీలు-దిరే ఆఫ్ హోప్ సినిమాకి జాతీయ అవార్డు వచ్చింది. ఇక మలయాళం లో హిట్ కొట్టిన Ullozhukku మూవీకి ఉత్తమ జాతీయ అవార్డు వరించింది. ప్రస్తుతం నందమూరి ఫ్యాన్స్ ఈ వార్త వినగానే తెగ సంబరపడిపోతున్నారు.అలాగే ఉత్తమ గేయ రచయితగా బలగం సినిమాలోని "ఊరు పల్లెటూరు" అనే పాటని రచించిన కాసర్ల శ్యామ్ అవార్డు అందుకున్నారు.అలాగే ఉత్తమ యాక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ)విభాగంలో ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన హను-మాన్ మూవీ కి అవార్డు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: