సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా కూలీ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించగా ... ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నాగార్జున విలన్ పాత్రలో నటించాడు. శృతి హాసన్ , ఉపేంద్రమూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనుండగా ... ఆమీర్ ఖాన్ ఈ సినిమాలో ఓ చిన్న క్యామియో పాత్రలో కనిపించబోతున్నాడు. పూజా హెగ్డే ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ చేసింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ రోజు అనగా ఆగస్టు 2 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను మేకర్స్ విడుదల చేయనున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ట్రైలర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా ..? లేదా అనేది తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఈ మూవీ కి "ఏ" సర్టిఫికెట్ వచ్చింది. ఇకపోతే "ఏ" సర్టిఫికెట్ సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు జారీ కావడంతో ఈ మూవీ లో అత్యంత భారీ రక్త పాతం ఉన్నట్లు తెలుస్తోంది. 

మరి ఈ సినిమాలో ఏ స్థాయిలో రక్త పాతం ఉంటుందో అనేది చూడాలి. ప్రస్తుతానికి ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకొని అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందో లేదో చూడాలి. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని పాటలు విడుదల కాగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: