మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి కొల్లి దర్శకత్వంలో మరికొన్ని రోజుల్లో ఓ మూవీ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి , బాబి కాంబోలో వాల్టేర్ వీరయ్య అనే సినిమా రూపొందింది.  ఈ మూవీ 2023 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో చిరంజీవి కి అద్భుతమైన విజయం దక్కగా , బాబీ కి సూపర్ సాలిడ్ క్రేజ్ దక్కింది. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. ఇలా తనకు అద్భుతమైన విజయాన్ని అందించిన బాబీ దర్శకత్వంలో చిరంజీవి మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాబి , చిరంజీవి కి ఓ కథను వినిపించగా అది అద్భుతంగా నచ్చడంతో చిరు వెంటనే బాబీ దర్శకత్వంలో మరో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

చిరు , బాబి కాంబోలో రూపొందబోయే రెండవ సినిమాను కేవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ వారు నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇక చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బాబి ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే చిరు తో చేయబోయే మూవీ కి మ్యూజిక్ డైరెక్టర్ ను కూడా బాబి కన్ఫామ్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... చిరు , బాబి, కేవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రూపొందబోయే సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది.

చిరు , బాబీ కాంబోలో రూపొందిన వాల్టేర్ వీరయ్య సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సంగీతానికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. దానితో చిరు , బాబి కాంబోలో రూపొందబోయే రెండవ సినిమాకు కూడా ఆయనే సంగీతం అందిస్తాడు అని చాలా మంది భావించారు. కానీ ఈ మూవీ కి సంగీతం తమన్  అందించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి చిరు , బాబి కాంబోలో తెరకెక్కబోయే రెండవ సినిమాకు ఎవరు సంగీతం అందిస్తారు అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: