
స్టోరీ విషయానికి వస్తే..
ఆకాశవీరయ్య (విజయ్ సేతుపతి) ఒక హోటల్లో పరోటాలు చేస్తూ ఉంటారు.. ఆ తర్వాత రాణి (నిత్యా మీనన్) అనే అమ్మాయిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ పెద్దలు ఒప్పుకోకపోవడంతో పారిపోయి పెళ్లి చేసుకుంటారు . మొదట ప్రేమగా సాగిన వీరి వైవాహిక జీవితం ఆ తర్వాత జరిగిన గొడవలతో ఇరువురు కుటుంబాల మధ్య విభేదాలతో ఆఖరికి విడాకుల దాకా వెళ్తారు. ఆ తర్వాత ఏమైంది నిజంగానే విడిపోయారా అనేదే కథ
సార్ మేడమ్ సినిమా ప్రతి దంపతులకు దగ్గరగా అనిపిస్తుంది. వివాహమైన భార్య, భర్త మధ్య తలెత్తే కొన్ని అపార్ధాలు కుటుంబాలలో జరిగేటువంటి సంఘటనలు తెరపైన చూపించారు. కథలో నెమ్మదిగా వెళ్లిన ఆ తర్వాత సినిమా బాగా ఆకట్టుకున్నట్లు తెలియజేస్తున్నారు. ఇందులో వచ్చే సందేశం కూడా ప్రతి ఇంట్లో ఉండే భార్యా,భర్త.. కుటుంబ సభ్యులను బాగా ఆకట్టుకుంటుంది. నిత్యామీనన్, విజయ్ సేతుపతి మధ్య కెమిస్ట్రీ కూడా ఈ సినిమాకి కీలకమని చెప్పవచ్చు. విజయ్ సేతుపతి చేసే కామెడీ, తన తల్లి భార్య మధ్య నలిగిపోయే భాగోద్వేగమైన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. యోగి బాబు, కాలి వెంకట్ పాత్రలు కూడా ఆకట్టుకున్నాయి.
ప్లస్ పాయింట్స్:
భార్య భర్తల మధ్య అనుబంధాన్ని తెరకెక్కించిన కథ కావడం.
ప్రతి ఒక్కరి నటన
క్లైమాక్స్ ఎమోషనల్ గా ఆకట్టుకోవడం.
మైనస్ పాయింట్స్:
కథలో కొత్తదనం తక్కువగా ఉండడం.
కొన్ని సన్నివేశాలు సాగతీతంగా ఉన్నది.
ఒక మధురమైన ఫ్యామిలీ డ్రామా సినిమాగా సార్ మేడమ్ ఉన్నది..
రేటింగ్...5/2.5