
చివరిసారిగా కిమ్ శర్మ హీరో హర్షవర్ధన్ రాణతో డేటింగ్ చేసినట్లుగా వార్తలు వినిపించాయి.. ఆ తర్వాత కొన్ని కారణాల చేత బ్రేకప్ అయ్యిందని మళ్లీ కెన్యాకు చెందిన ఆలీపుంజాని పెళ్లి చేసుకుందని బాలీవుడ్లో కథలు వినిపించాయి. అందుకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారిన మళ్లీ 2017లో వీరు విడిపోయారని వార్తలు వినిపించాయి. ఇలా డేటింగ్, ఎఫైర్లు రూమర్లతోనే ఒక హిస్టరీ క్రియేట్ చేసిన కిమ్ శర్మ. సోషల్ మీడియాలో కూడా నిత్యం ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ హిట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది.
టాలీవుడ్ లో కూడా ఖడ్గం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కిమ్స్ శర్మ. డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించారు. అలాగే ఆంజనేయులు అనే చిత్రంలో కూడా కిమ్ శర్మ నటించింది. బాలీవుడ్ లో మాత్రం పలు చిత్రాలలో నటించి మంచి విషయాలను అందుకున్నది. నటుడు హర్షవర్ధన్ రాణ సరసన ఒక ప్రేమ కథ చిత్రంలో నటించింది. ఆ సమయంలోను వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైందని మీడియాలో కథలుగా వినిపించాయి. ఇప్పుడు మళ్లీ చాలా గ్యాప్ తర్వాత బికినీ ఫోటోలతో వైరల్ గా మారుతున్నది.