
ట్రైలర్ విషయానికి వస్తే.. "ఒకడు పుట్టగానే వాడు ఎవడు చేతిలో చావాలన్నది.. తల మీద రాసిపెట్టి ఉంటుంది" అనే డైలాగ్ తో నాగార్జున వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ శృతిహాసన్ ఎంట్రీతో ట్రైలర్ మరింత ఆసక్తికరంగా మారింది. ఇక మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ కూడా మరోసారి తన అద్భుతమైన నటనను కనబరిచారు. హీరో నాగార్జున కూడా ఇందులో విలన్ గా నటిస్తున్నట్లు కనిపిస్తోంది. అమీర్ ఖాన్ కూడా చాలా విభిన్నమైన గెటప్లో కనిపిస్తున్నారు. ఇకపోతే ట్రైలర్ లో ఎక్కువగా నాగార్జున, రజనీకాంత్ పాత్రలకే డైరెక్టర్ ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్లు అనిపిస్తోంది. మరోవైపు నటుడు సత్యరాజ్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ట్రైలర్ లో రివీల్ చేశారు.
ఇదిలా ఉండగా.. రజనీకాంత్ ఇందులో కూలీ గా కనిపించబోతున్నట్లు ట్రైలర్ లో చూపించారు. అంతేకాదు ట్రైలర్ లో మరికొన్ని ట్విస్టులు ఉండేలా కనిపిస్తున్నాయి.. అలాగే సత్యరాజ్ , రజనీకాంత్ ఇద్దరు కూడా ఇందులో స్నేహితులుగా కనిపిస్తున్నారు. మొత్తానికి ట్రైలర్ తో కూలీ సినిమాకి మరింత హైప్ తీసుకువచ్చారు. నాగార్జున వయోలెన్స్ ట్రైలర్లో హైలెట్గా కనిపిస్తోంది. రజనీకాంత్ కెరియర్ లో 171 వ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను సుమారుగా 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.తమిళ్ తో పాటూ తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ వంటి భాషలలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి అంటే ఆగస్టు 14 వరకు ఆగాల్సిందే.