పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ "ఓ జి" . డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఈ సినిమాలో నటిస్తున్నారు . ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన సినిమా "హరిహర వీరమల్లు" సినిమా రిలీజ్ అయ్యి ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యింది అనేది అందరికీ తెలిసిందే . బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ పవన్ కళ్యాణ్ కి పడింది అంటూ ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకున్నారు . అయితే ఆ వెంటనే ఫ్యాన్స్ కి మరింత హైప్  పెంచేలా అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తించేలా సిద్ధమవుతుంది ఓజి.
 

ఈ నేపథ్యంలోనే దీనికోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు మూవీ మేకర్స్ శుభవార్త అందించారు . ఈ సినిమాకి సంబంధించిన "ఫైర్ స్ట్రోమ్" అనే పాట లిరికల్ గీతాన్ని రిలీజ్ చేశారు . అభిమానుల కి ఈ పాట బాగా నచ్చేసింది. ఈ పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. పవన్ కళ్యాణ్ కటౌట్ ..పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది.  ఈ పాటను ధమన్ కంపోజ్ చేశారు.  అయితే ఈ పాట ప్రెసెంట్ వినడానికి బాగానే ఉన్నా.. కానీ బాగా బాగా వినే మూది ఈ పాట వింటుంటే ఎక్కడో ఆల్రెడీ విన్న పాటలానే ఉంది అంటున్నారు కొంతమంది జనాలు .



తమన్ మళ్లీ కాపీ కొట్టేసావా ..? అంటూ ట్రోల్ చేస్తున్నారు. కేవలం ఈ సినిమా విషయంలోనే కాదు.  గతంలో ఆయన తెరకెక్కించిన పలు సినిమాల విషయంలో కూడా ఇదే ట్రోలింగ్ ఫేస్ చేశాడు అన్న నిందలు కూడా ఉన్నాయి.  ఏ వివాదం పైన అయిన స్పందించే తమన్ .. ఈ వివాదంపై మాత్రం అసలు స్పందించలేదు . కాగా ముంబై బ్యాక్ గ్రౌండ్ లో గ్యాంగ్ స్టార్ జీవితాన్ని ఆధారంగా బేస్ చేసుకుని ఈ ఓ జి మూవీ తెరకెక్కింది. పవన్ కళ్యాణ్ ని ముందు ఎప్పుడూ చూడని కొత్త లుక్ లో శక్తివంతమైన గ్యాంగ్ స్టార్ పాత్రలో చూపిస్తున్నారు సుజిత్ . పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందు రాబోతుంది ఈ సినిమా..!!



మరింత సమాచారం తెలుసుకోండి: