బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సైతం ఒక్కొక్కరు గుడ్ న్యూస్ తెలియజేస్తూ ఉన్నారు. టాలీవుడ్ లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి చెప్పగా.. ఇటీవలే కియారా అద్వాని, దీపికా పదుకొనే తదితర సెలబ్రిటీలు తల్లిగా ప్రమోషన్ అందుకున్నారు. ఇప్పుడు తాజాగా మరొక బాలీవుడ్ హీరోయిన్ తల్లి కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు కత్రినా కైఫ్. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ని ప్రేమించి మరి వివాహం చేసుకున్న కత్రినా కైఫ్ త్వరలోనే పేరెంట్స్ కాబోతున్నారనే వార్త బాలీవుడ్లో తెగ వైరల్ గా మారుతోంది.


ఈమధ్య చాలామంది సెలబ్రిటీలు కూడా సినిమాలలో కంటే ఎక్కువగా తమ పర్సనల్ లైఫ్ కే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఒక్క సినిమాలో కూడా నటించకుండానే ప్రేమలో పడ్డారు. చాలాకాలం తర్వాత తాము రిలేషన్ లో ఉన్నామనే విషయాన్ని బయటపెట్టారు. ముఖ్యంగా కరణ్ జోహార్ వంటి షోలో కత్రినా చేసిన కామెంట్స్.. ఆ తర్వాత ఒక అవార్డు అందుకుంటున్న సమయంలో విక్కీ కౌశల్ ప్రపోజల్ చేసినటువంటి సమయం నుంచే వీరి ప్రేమ కథ బయటపడింది.


అలా ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో 2021 డిసెంబర్లో వివాహం చేసుకొని ఒకటయ్యారు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్. ఇటీవలే ముంబైలో ఆలీబాగ్ కి ప్రయాణిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేవలం ప్రెగ్నెంట్ అయిన వారు మాత్రమే ధరించేటువంటి ఒక చొక్కాను కత్రినా కైఫ్ ధరించడంతో పలువురు నెటిజెన్స్ ఆమెను ప్రశ్నిస్తూ ఉన్నారు.. అంతేకాకుండా ప్రముఖ క్రిటిక్ ఉమైరు సందు కూడా కత్రినా కైఫ్ ఇప్పుడు రెండు నెలల గర్భవతి అంటూ ఒక పోస్ట్ ని షేర్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకు విక్కీ కౌశల్ ,కానీ కత్రినా కైఫ్ కానీ స్పందించలేదు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి అభిమానులు ఆనందపడుతున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి. తెలుగులో వెంకటేష్ జోడిగా మల్లేశ్వరి సినిమాలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: