
ఇక మరుసటి రోజే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అందుబాటులో ఉన్న టికెట్ ధరలు, పండగ వాతావరణం లాంటి ఎఫెక్ట్‌లతో ఫ్యామిలీస్ థియేటర్లకు క్యూ కట్టాయి. ఫలితంగా మొదటి వీకెండ్లోనే హౌస్ ఫుల్ షోలు… తరువాత వీక్ డేస్‌లోనూ స్టెడీ కలెక్షన్స్. ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ ట్రేడ్ టాక్ ఏంటంటే… రెండో వీకెండ్లో 'మహావతార నరసింహ' బాక్సాఫీస్‌ను ఊహించని స్థాయిలో షేక్ చేస్తోంది. శుక్రవారం రూ.7 కోట్లు.. శనివారం రూ.10 కోట్ల దాకా వసూలు చేసిందంటే ఇది చిన్న విషయం కాదు! రిలీజ్ రోజు వచ్చిన రూ.2 కోట్ల కలెక్షన్‌ను పదో రోజున ఐదు రెట్లు దాటి పోయింది. ఇప్పటి వరకూ ఇండియా వైడ్‌గా ఈ మూవీ రూ.70 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. అది కూడా కేవలం మౌత్ టాక్‌తోనే! తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్.
విడుదలైన థియేటర్ల సంఖ్య మొదట కేవలం కొద్దే ఉండగా… ఇప్పుడు రెండో వీకెండ్‌కు నాలుగైదు రెట్లు పెరిగిపోయింది. అంతేకాకుండా, విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' లాంటి బిగ్ బడ్జెట్ సినిమాకు పోటీగా నిలుస్తోంది. హిందీలో కూడా అజయ్ దేవగణ్ నటించిన ‘సన్నాఫ్ సర్దార్ 2’ కన్నా ఎక్కువ కలెక్షన్లు సాధించడంతో టాక్ మరింత పెరిగిపోయింది. ఇది ఓ విజువల్ వండర్ మాత్రమే కాదు… కథ, సంగీతం, డైలాగ్స్, ఎమోషన్స్ అన్నిటితో కూడిన పురాణ పునఃరావృతం. ఒక చిన్న సినిమా, ప్రమోషన్ లేకుండా ఎలా బ్లాక్‌బస్టర్ అవుతుందో ‘మహావతార నరసింహ’ నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది. ప్రేక్షకుల నమ్మకం, మంచి కంటెంట్‌ను ఎలా ఎలివేట్ చేస్తుందో ఇది చూపించింది. ఇలాంటి గొప్ప సినిమాలకు సలాం చెప్పాల్సిందే!