
హృతిక్ కంటే ఎన్టీఆర్ హైనా? .. ట్రైలర్ చూస్తేనే నెటిజన్లు అంటున్నారు – "ఈ సినిమా హృతిక్‌దా? తారక్‌దా?" అని. అంత బలంగా ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ చూపించారట. ట్రైలర్‌లో కనిపించిన సన్నివేశాల కంటే సినిమాలో వచ్చే ఎన్టీఆర్-హృతిక్ ఫేస్ ఆఫ్ సీన్స్ రెచ్చిపోతాయని, తారక్ ఓ రేంజ్‌లో రచ్చచేసారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. తారక్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తుందని, కథంతా ఎన్టీఆర్ చుట్టూనే తిరుగుతుందని సమాచారం. కియారా గ్లామర్ టాక్ .. ఇక సినీ విశ్లేషకులు, నెటిజన్లు చెప్పుకుంటున్న విషయం ఇంకొకటి – కియారా అద్వానీ బికినీ లుక్! ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నా... ట్రైలర్ చూసిన తర్వాత డిస్కషన్ ఎక్కువగా ఆమె హాట్ లుక్ గురించే నడుస్తుండడం ఆసక్తికరం. ఈ సినిమాతో తన గ్లామర్ మార్క్ మరోసారి బలంగా చూపించిందని అంటున్నారు.
బాక్సాఫీస్ యుద్ధానికి రెడీ!.. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించగా, అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో తెరకెక్కింది. తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ విడుదల చేస్తున్నారు. ఆయన ఈ థియేట్రికల్ రైట్స్ కోసం ఏకంగా రూ.80 కోట్లు పెట్టినట్టు సమాచారం. ఇదే రోజు రజినీకాంత్ ‘కూలీ’ కూడా రిలీజ్ కావడంతో, బాక్సాఫీస్ దగ్గర అసలైన గట్టిపోరు జరగనుంది. తారక్ ఫ్యాన్స్‌కు ఇదో పండుగే. ‘వార్ 2’ ఘన విజయం సాధిస్తే, ఎన్టీఆర్ బాలీవుడ్‌లో దూకుడు పెంచే అవకాశాలు వున్నాయి. స్టైలిష్ యాక్షన్, తారక్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ – ఈ మూవీ ఆగస్ట్ 14న ప్రేక్షకుల్ని ఊపేసేలా వుంది!