
ఈ విషయంపైన తమన్నా ఇటీవలే స్పందిస్తూ ఆ రూమర్స్ ని ఖండించడం జరిగింది.. ఒకసారి కలిసి కనిపిస్తే పెళ్లి చేసేస్తారా అంటూ ఫైర్ అవుతోంది. సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలకు కొదవేమీ లేదంటూ ఫైర్ అయ్యింది. గతంలో ఒక జువెలరీ షాప్ ఓపెనింగ్స్ కి వెళ్లినప్పుడు అబ్దుల్ తో కలిసి తమన్నా జువెలరీ షాప్ ఓపెనింగ్ లో హాజరు అయ్యింది.. కేవలం జువెలరీ షాప్ ఓపెనింగ్స్ కి మాత్రమే అక్కడ పాల్గొన్నా.. అంతకుమించి ఏమీ లేదంటు తేల్చి చెప్పింది తమన్నా.
గతంలో కూడా ప్రముఖ క్రికెటర్ కోహ్లీతో తాను రిలేషన్ లో ఉన్నట్లు ఎన్నో రూమర్స్ సృష్టించారు తామిద్దరం కేవలం ఒక యాడ్లో మాత్రమే కలిసి పనిచేశాము కానీ అప్పటికే ఇలాంటి రూమర్స్ ఎన్నో సృష్టించడంతో చాలా బాధ కలిగిందంటూ ఎమోషనల్ గా మాట్లాడింది. ఇలా ఎవరితో కలిసి పని చేసిన కూడా వారితో ఇలా ఎఫైర్స్ రాయకండి అంటూ తెలియజేసింది తమన్నా. ఇప్పట్లో తనకి పెళ్లి చేసుకొని ఆలోచన అయితే లేదని వెల్లడించింది. ప్రస్తుతం వరుస సినిమాలతో పలు రకాల బ్రాండ్ యాడ్లలో దూసుకుపోతోంది తమన్నా. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గానే ఉన్నది.