సాధారణంగా ఏ స్టార్ డైరెక్టర్ అయిన.. తమ ఫేవరెట్ హీరోయిన్ తో హీరోతో వర్క్ చేయాలని అనుకుంటారు.  ఖచ్చితంగా ఆ ఛాన్స్ వస్తే మిస్ చేసుకోరు . అయితే రాజమౌళి మాత్రం టూ డిఫరెంట్ . ఎంత డిఫరెంట్ అంటే ఆయన ఫేవరెట్ హీరోయిన్ తో వర్క్ చేసే ఆఫర్  వచ్చిన కూడా వద్దు వద్దు ఈ కథకి వేరే హీరోయిన్ బాగుంటుంది అంటూ చేతికి వచ్చిన అవకాశాన్ని వదులుకునేసాడు.  దానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . రాజమౌళి ప్రెసెంట్ మహేష్ బాబు తో ఓ సినిమా చేస్తున్నాడు .


మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా  షూటింగ్ చకచకా కంప్లీట్ చేసుకుంటుంది . ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.  మరొక హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ సెలెక్ట్ అయినట్లు టాక్ వినిపిస్తుందే కానీ అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు.  కాగా ఇప్పుడు రాజమౌళి ఫేవరెట్ హీరోయిన్ ఎవరు..? ఎందుకు ఆమెతో సినిమా చేయలేదు ..? అన్న డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి. ఇందస్ట్రీలో ఇప్పుడు ఇదే బిగ్ హాట్ టాపిక్.



ఒకానొక ఇంటర్వ్యూలో రాజమౌళినే ఈ విషయాని బయటపెట్టారు.  తన ఫేవరెట్ హీరోయిన్ శృతిహాసన్ అంటూ బయట పెట్టారు . అదేవిధంగా "మర్యాదరామన్న" సినిమాలో హీరోయిన్ "సలోని" చాలా బాగా నటించింది అంటూ చెప్పుకొచ్చారు . ఆమె ఎక్స్ప్రెషన్స్ ఎప్పటికీ మర్చిపోలేను అన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు . శృతిహాసన్ డాన్సింగ్ స్టైల్ .. పర్ఫామెన్స్ ఆయనకు చాలా చాలా ఇష్టమంటూ వివరించారు . అయితే శృతిహాసన్ తో ఎందుకు సినిమా చేయలేదు అంటే మాత్రం ఆ ఛాన్స్ రాలేదన్న సమాధానమే వచ్చింది. అంతేకాదు గతంలో ఓ సినిమా విషయంలో ఆయన శృతిహాసన్ ని హీరోయిన్ గా తీసుకోవాలి అనుకున్న ఆ క్యారెక్టర్ కి ఆమె బాడీ సూట్ కాదు అంటూ రిజెక్ట్ చేశారట.  సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది . రాజమౌళి ఏ నిర్ణయం తీసుకున్న సరే పర్ఫెక్ట్ గా ఆలోచించి నిర్ణయించి తీసుకుంటారు దానికి ఇది కూడా బిగ్ ఎగ్జాంపుల్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: