
ఈ సినిమాలో పార్థు పాత్రలో మహేష్ బాబు అద్భుతమైన అభినయంతో అదరగొట్టారు. మణిశర్మ మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు. ఈ సినిమాలో మహేష్ బాబు సెటిల్డ్ పర్ఫామెన్స్, పంచ్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ టేకింగ్, బ్రహ్మానందం కామెడీ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో మెప్పించిన ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు రీరిలీజ్ సినిమాలలో హైయెస్ట్ కలెక్షన్లను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎన్నిసార్లు చూసినా మళ్లీమళ్లీ చూడాలనిపించే ఈ సినిమాకు ఓవర్సీస్ లో బుకింగ్స్ బాగున్నాయి. అప్పుడు థియేటర్లలో చూడటం మిస్సైన అభిమానులు, ఈ సినిమాను ఇష్టపడే అభిమానులు థియేటర్లలో ఈ సినిమాను మళ్ళీ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమా రీరిలీజ్ హక్కులు 3 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడైనట్టు తెలుస్తోంది.
నైజాం ఏరియాలో ఏషియన్ సునీల్ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఆగష్టు 9వ తేదీన బాక్సాఫీస్ వద్ద రిలీజయ్యే సినిమాలు కూడా లేకపోవడంతో అతడు కలెక్షన్ల పరంగా సంచలనాలు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. రీరిలీజ్ సినిమాలతో సైతం తిరుగులేని రికార్డులను సొంతం చేసుకోవడం ద్వారా మహేష్ బాబు అభిమానులను అలరిస్తున్నాడు. మహేష్ కెరీర్ లోని సినిమాలలో అతడు సినిమాకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చు.