సాధారణంగా ఏదైనా సినిమా రిలీజ్ అయింది అంటే చాలు ఎక్కువగా యూట్యూబ్ రివ్యూలు, ట్విట్టర్ కామెంట్స్, ఇంస్టాగ్రామ్ రీల్స్ వారికి ఇష్టం వచ్చినట్లుగా రివ్యూలు ఇస్తూ ఉంటారు. వీటి వల్ల చాలా సినిమాలకు దెబ్బ పడుతూ ఉంటుంది. అసలు సినిమా ఎలా ఉందో తెలిసేలోపే ఫ్లాప్ అంటూ కొంతమంది చెప్పే ఓవరాక్షన్ కామెంట్స్ అలాగే బోరింగ్ అంటూ ట్యాగులతో దండం పెట్టే ఎమోజీలతో ప్రేక్షకులను దారి తప్పిస్తూ ఉంటారు కొంతమంది రివ్యూ మేకర్స్.


ఇలాంటి విషయాలపైన ఇప్పటికే చాలామంది నిర్మాతలు, హీరోలు డైరెక్టర్లు సైతం వీరి మీద ఫైర్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఈ విషయం పైన మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.. ఇటీవలే బాలీవుడ్ లో ఈ అమ్మడు నటించిన సన్ ఆఫ్ సర్దార్2 సినిమా విడుదలై మిక్స్డ్ టాకును సొంతం చేసుకుంది. కానీ ఈ క్రమంలోనే మృణాల్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ఒక చిట్ చాట్ ను నిర్వహించింది. ఇందులో ఒక అభిమాని నెగిటివ్ రివ్యూ చూసి.. సన్ ఆఫ్ సర్దార్ 2 చూడలేకపోయాము అంటూ కామెంట్స్ చేశారట.


దీనిపై మృణాల్ ఠాకూర్ స్పందిస్తూ చాలా రివ్యూలు తప్పుదారి పట్టించేవే ఉంటాయి. అందుకే ఎవరూ కూడా రివ్యూలను నమ్మకండి మీరు సినిమా చూసిన తర్వాత ఏదైనా ఒక అభిప్రాయానికి రావాలి ఒక్కోసారి సినిమా ఫెయిల్యూర్ కి రివ్యూలే కారణమవుతూ ఉంటాయని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఇప్పటికే చాలామంది నిపుణులు సైతం థియేటర్ల వద్ద రివ్యూలు చెప్పే విషయాన్ని రద్దు చేయాలని తెలియజేశారు. అయినా కూడా ఇలాంటి వారు ఆగడం లేదు. మృణాల్ ఠాకూర్ అడవి శేషు నటిస్తున్న డెకాయిట్ చిత్రంలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: