సినిమా ఇండస్ట్రీ లో ఒక మూవీ విడుదల కానుంది అంటే ఆ సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నట్లయితే ఆ మూవీ కి సంబంధించిన ట్రైలర్ కూడా అదే రేంజ్ లో ఉన్నట్లయితే ఆ మూవీ పై అంచనాలు తారా స్థాయికి చేరుపోతూ ఉంటాయి. ఇక ఓ సినిమా మొదలు అయ్యి షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఆ సినిమాపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేకపోయినా సినిమా ట్రైలర్ వచ్చాక అది అద్భుతంగా ఉన్నట్లయితే సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోతూ ఉంటాయి. తాజాగా సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఇందులో నాగార్జున విలన్ పాత్రలో నటించాడు.

మూవీ స్టార్ట్ అయినప్పటి నుండి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్న చాలా మంది జనాలు ఈ మూవీ ట్రైలర్ ఏ స్థాయిలో ఉంటుందా అనే ఆసక్తితో కూడా ఎదురు చూశారు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ లో రజనీ కాంత్ తో పాటు అనేక మంది నటీ నటులను చూపించారు. కానీ ఎవరు ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారు ..? ఎవరు ఎలా వ్యవహరించబోతున్నారు ..? అనే దానిపై చిన్న హింట్ కూడా ఇవ్వకుండా ట్రైలర్ను క్లోజ్ చేసేసారు.

దీనితో చాలా మంది లోకేష్ చాలా తెలివిగా వ్యవహరించాడు. సినిమా కథను ఏ మాత్రం లీక్ చేయకుండా మూవీ ట్రైలర్ను కొనసాగించాడు అని అభిప్రాయ పడుతున్నారు. దీనితో కొంత మంది లోకేష్ ట్రైలర్ను చాలా తెలివిగా కట్ చేశాడు. కానీ సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలను పెంచే విధంగా ఈ మూవీ ట్రైలర్ లేదు. అది ఈ మూవీ కి ప్లేస్ కావచ్చు ... మైనస్ కూడా కావచ్చు అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: